ఫోర్బ్స్‌ జాబితాలో అనుష్క, సింధు | Sakshi
Sakshi News home page

ఫోర్బ్స్‌ జాబితాలో అనుష్క, సింధు

Published Tue, Mar 27 2018 1:18 PM

Anushka Sharma, PV Sindhu  Make It To Forbes Asia List - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆసియాలో 30 సంవత్సరాల వయసులోపున్న వివిధ రంగాల్లో సత్తా చాటిన 300 మంది ఎంటర్‌ప్రెన్యూర్లు, ఇన్నోవేటర్ల జాబితాను ఫోర్బ్స్‌ ప్రకటించింది. ఆసియా 30 అండర్‌ 30 -2018 పేరిట ప్రకటించిన ఈ జాబితాలో బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ, బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధులకు చోటుదక్కింది. వినోద, వాణిజ్య, వెంచర్‌ క్యాపిటల్‌, రిటైల్‌, సోషల్‌ ఎంటర్‌ప్రెన్యూర్లు వంటి పలు రంగాల నుంచి పలువురిని ఫోర్బ్స్‌ ఎంపిక చేసింది.

ఇంకా ఈ జాబితాలో భారత్‌ నుంచి మోడల్‌ భూమికా అరోరా, సైనప్‌ సీఈఓ అశ్విన్‌ రమేష్‌, అథ్లెట్‌ శ్రుతి మంథన, హేడేకేర్‌ ఫౌండర్‌ దీపాంజలి దాల్మియా, హెల్త్‌సెట్‌గో ఫౌండర్‌ ప్రియా ప్రకాష్‌ వంటి యువ వాణిజ్యవేత్తలు, టెక్నోక్రాట్లున్నారు.

Advertisement
Advertisement